సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. డెంగీని ఆదిలోనే అంతం చేసేందుకు అన్ని చర్యలు తీ సుకుంటున్నారు. 642 బృందాలతో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రతి సరిల్లో 64 మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లు, ప్రతి సర్కిల్లో ప్రత్యేక వాహనాలు, ప్రతి డివిజన్లో అదనంగా మరో 10 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాంతాల్లో దోమల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరం లో వారం రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఒకపక్క ప్రజలను అప్రమత్తం చేస్తున్న జీహెచ్ఎంసీ మరోపక్క శాఖ పరంగా చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో ము మ్మరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బల్దియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటి శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించని పక్షంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పా టించకుంటే దోమల ద్వారా డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని బల్దియా అధికారులు తెలిపారు. ఇందుకు ముందస్తు జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని చెబుతున్నారు. నవజాత శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధు లు, వ్యాధి నిరోధక శక్తి తకువగా ఉన్న వారికి డెంగీ సోకుతుందని జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు.
642 బృందాలు.. ఇంటింటికీ తిరిగి..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ ఎం టమాలజీ విభాగం అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఈ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. చెరువుల్లో దోమల ఉత్పత్తిని అరికట్టడానికి డ్రోన్ల ద్వారా నివారణ మందులు పిచికారీ చేస్తున్నారు. అన్ని బస్తీల్లో ఫాగింగ్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టి దోమల ద్వారా సంక్రమించే వ్యా ధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. డెంగీ పాజిటివ్ నమోదైన వెంటనే మరొక కొత్త కేసు నమోదు కాకుండా వెంటనే నివారణ చర్యలు చేపడుతున్నట్లు ఎంటమాలజీ అధికారులు చెబుతున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..