సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పలు కంపెనీల మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) సీనియర్ లీడర్స్ పేర్కొన్నారు. శంషాబాద్ పరిధిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)లో అభ్యుదయ్-2022 మేనేజ్మెంట్ ఓరియంటేషన్లో భాగంగా ‘మేకింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ బీ-స్కూల్ జర్నీ’ అంశంపై సంస్థ ఆడిటోరియంలో శుక్రవారం ప్యానల్ డిస్కషన్ జరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్-క్యాంపస్ రిలేషన్స్ హెడ్ ఆశిష్ భల్లా, టెక్ మహీంద్రా బిజినెస్ హెచ్ఆర్ సాహిల్ నాయర్, కేపీఎంజీ మానవ వనరుల విభాగం, జెన్ ప్యాక్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – టాలెంట్ అక్విజిషన్ లీడర్ మహ్మద్ హాసన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వెంకటేశ్ పాలబట్ల, ఐఎంటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీహర్షరెడ్డి హాజరై ప్రసంగించారు.