అంబర్‌పేట, జూన్ 29: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు బి.దీపక్‌కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అంబర్‌పేట రఘునాథ్నగర్కు చెందిన కె.రమేశ్, నల్లకుంట డివిజన్ బీజేవైఎం కార్యదర్శి భిక్షపతి, కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన బీజేపీ నాయకులు సూర్యారావు, రాజేశ్ బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని కండ్లారా చూస్తున్న ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని వెల్లడించారు. త్వరలోనే మరింత మంది ఇతర పార్టీల నాయకులు, పలు సంస్థల ప్రతినిధులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, మేడి ప్రసాద్, చంద్రమోహన్, సీనియర్ నాయకులు ఆర్కే బాబు, కనివేట నర్సింగ్‌రావు, రాము, శంకర్, దిలీప్, మీసాల నర్సింగ్‌రావు, సత్యనారాయణ, ప్రదీప్, సునీల్ బిడ్లానీ, జాకీ తదితరులు పాల్గొన్నారు.