బడంగ్‌పేట, జూన్ 23 : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు బండారి మనోహర్, బాలు నాయక్‌తో కలిసి మేయర్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు. ప్రజల మౌలిక సదుపాయలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నామని అన్నా రు. వర్షా కాలంలో పారిశుధ్యం లోపించ కుండా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొర్ర జగన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జనిగ శ్రీనివాస్‌యాదవ్, బొర్ర మాధవరెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
మీర్‌పేట అభివృద్ధికి పెద్ద పీట ..
విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి సహకారంతో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని మేయర్ దుర్గాదీప్‌లాల్‌చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్లో రూ.10లక్షలు, 33వ డివిజన్లో రూ.3లక్షలు, 34వ డివిజన్లో రూ.10 లక్షలు, 21వ డివిజన్లో రూ. 84లక్షల అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లకు నిధులు కేటాయించిన్నట్లు పేర్కొన్నారు. కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వరద కాల్వలను పరిశీలించారు. రోడ్లతో పాటు నాలాల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులు వేగ వంతం చేయాలని అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కమిషనర్ సీహెచ్. నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు అర్కల భూపాల్‌రెడ్డి, కీసర గోవర్ధన్‌రెడ్డి, గజ్జల రాంచందర్, సిద్దాల లావణ్య బీరప్ప, భీంరాజ్, చవ్వ మణెమ్మ, బొక్క రాజేందర్‌రెడ్డి, కీసర హ రినాథ్రెడ్డి, భిక్షపతి, నాయకులు చవ్వ శ్రావన్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, రమేశ్ ఉన్నారు.