బోనాలు, బతుకమ్మలతో సందడి..
కైత్లాపూర్ ఆర్వోబీ ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా సాగాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కృష్ణారావులకు బోనాలు, బతుకమ్మలు, కోలాటంతో మహిళలు స్వాగతం పలికారు. ఫ్లైఓవర్‌కు వెళ్లే దారిలో మహిళలు గుంపులు గుంపులుగా బతుకమ్మలు ఆడారు. బోనాల సందడి ఓవైపు.. కోలాటం ఆటాపాటలు మరోవైపు.. ఒంటెలతో స్వాగతం.. కళాకారుల నాట్య విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
కూకట్‌పల్లికి వరాల జల్లు..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ సభాముఖంగా వరాల జల్లు కురిపించారు. కూకట్‌పల్లిలో ఐడీఎల్ చెరువుతో పాటు మిగిలిన చెరువులన్నింటినీ సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల అభివృద్ధిలో భాగంగా ఎస్టీపీలను నిర్మించడం జరుగుతుందని భవిష్యత్‌లో చెరువులన్నీ బాగు చేయనున్నట్లు తెలిపారు. బాలానగర్‌లోని ప్రభుత్వ స్థలంలో వంద పడకల వైద్యశాలను నిర్మించనున్నట్లు హామీనిచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీపై కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రజలకు తీపి వార్త అందించనున్నట్లు స్పష్టం చేశారు. మొదటి దశలో చెరువులు, నాలాలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని.. త్వరలోనే మిగిలిన చెరువులన్నింటినీ సుందరీకరించనున్నట్లు తెలిపారు. బాలానగర్‌లో వందపడకల వైద్యశాలకు నిధులు మంజూరు చేసి త్వరలోనే మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందామని ప్రజలకు తెలిపారు. అడిగిందే తడువుగా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కేటీఆర్ హామీనివ్వడంతో ఎమ్మెల్యే కృష్ణారావు ప్రత్యేక ధన్యవాలు తెలిపారు.నియోజకవర్గానికి చెందిన 354 మహిళా సంఘాలకు సంబంధించిన రరూ.25వకోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును మంత్రి కేటీఆర్ మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్ నాయత్వంలోని రాష్ట్ర పూసల సంఘం నాయకులు మంగళవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలసి రవీంద్రభారతిలో నిర్వహించబోయే పూసల కులస్తుల ఆత్మీయ సమ్మేళనం మహాసభకు ముఖ్య అతిథులుగా రావాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు కోల శ్రీనివాస్ చెప్పారు.