కవాడిగూడ/చిక్కడపల్లి, జూన్ 21: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రముఖ యోగా ట్రైనర్, జాతీయ ఛాంపియన్ షిప్ క్వాలిఫైయర్ పద్మజా దేవరకొండ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం భోలక్‌పూర్ డివిజన్లోని పీఅండ్‌టీ కాలనీలోని ఆమె ఆన్లైన్లో యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా అనేది ఒక నిరంతర సాధన అని, దీని ద్వారా అనేక వ్యాధులను జయించవచ్చన్నారు. కరోనా కష్ట కాలంలో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా, మందులు వాడకుండా తాను ఆరోగ్యంగా ఉండడానికి యోగానే దోహదపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.
యోగాతోనే మానసిక ప్రశాంతత పులిగారి గోవర్ధన్ రెడ్డి
యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం కవాడిగూడలోని ఇంగ్లిష్ యూనియన్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
గాంధీనగర్ టీఆర్టీ గ్రౌండ్స్‌లో..
గాంధీనగర్ టీఆర్టి గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమలో పాల్గొన్న బీజేపీ నగర నాయకుడు ఎ.వినయ్‌కుమార్ మాట్లాడుతూ యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రత్నసాయి చంద్,, నాయకులు ఆకుల సురేందర్, సత్తిరెడ్డి, సురేశ్, నరేందర్, సాయి తరుణ్, అభిషేక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.