కందుకూరు, జూన్ 20: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నార్ముల్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి మంత్రి సబితను సోమవారం కలిసి పాడి రైతుల కోసం కందుకూరు మండల కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం నిర్మించడానికి మండల కేంద్రంలో ఎకరం స్థలం ఇప్పించాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించి పాడి రైతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం, పాడి రైతులకు లీటరు పాలకు రేట్లను పెంచినట్లు పేర్కొన్నారు. పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కలెక్టరు అమోయ్ కుమార్తో మాట్లాడి త్వరలో భవనాన్ని నిర్మించుకోవడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టరు అశోక్ కుమార్, స్థానిక పాల సొసైటీ చైర్మన్లు, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, వహీద్, రాంచంద్రయ్య, పర్వతాలు, బుచ్చిరెడ్డి, బీరప్ప, కృష్ణయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం, మహేందర్రెడ్డిలు పాల్గొన్నారు.