దుండిగల్,జూన్17: పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ, మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలోని పలు క్రీడాప్రాంగణాలు, పార్కులను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, కోట్లాది రూపాయల నిధులను స్థానికంగా అభివృద్ధి పనులకు వెచ్చిస్తోందని వారు తెలిపారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేసి, మోడ్రన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ పోగ్రామ్(ఎస్ఎన్డీపీ) పనుల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థతో పాటు బాచుపల్లి క్రాంతినగర్‌లోని పట్టణ ప్రకృతి వనాన్ని, 14వ డివిజన్లోని ఎస్ఎన్డీపీ పనులను సందర్శించారు.
ఈ సందర్భంగా 1వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలోఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేసేందుకు కృషి చేసిన సంబంధిత అధికారులను మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి, రాజేశ్వరి, సురేశ్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ సీఈ వసంత, ఈఈ సత్యనారాయణ, ఏడీఎం శ్రీనివాస్‌రెడ్డి, నళిని, టీఆర్ఎస్ నాయకులు సుబ్బారావు, వెంగయ్యచౌదరి, రవికాంత్, డివిజన్ ప్రెసిడెంట్ నాయుడు, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 31వ డివిజన్ రాజీవ్‌గృహకల్పలో కార్పొరేటర్ ఆవుల ప్రసన్న జగదీశ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్ణణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరితహారం మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు భిక్షపతి, సరస్వతి, కుమార్‌రెడ్డి నర్మద, స్వర్ణకుమారి, వెంకటేశ్, శివ, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో..
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి 27వ వార్డులో కౌన్సిలర్ కొర్రా శంకర్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు సభను నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నూతంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం పద్మారావు మాట్లాడుతూ.. డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు, తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని, శిథిలమైన విద్యుత్ స్తంభాలను తొలగించి, కొత్తవాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సునంద, మిషన్ భగీరధ, ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
డివిజన్లో..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలొని వెంకటాద్రినగర్‌లో ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి పాల్గొని అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు, సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.