అంబర్‌పేట/ కాచిగూడ, జూన్ 17: ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కాచిగూడ డివిజన్లోని కుద్భిగూడలో రూ.6 లక్షల వ్యయం తో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీలను అభివృద్ధి చేస్తానని అన్నారు. డ్రైనేజీ పైపులైన్ అందుబాటులోకి వస్తే కాచిగూడ డివిజన్ ప్రజలకు మురుగు సమస్య నుంచి మోక్షం లభిస్తుందని అన్నారు. జలమండలి డీజీఎం సన్యాసిరావు, దిడ్డి రాంబాబు, మేనేజర్ భావన, కన్నె రమేశ్‌యాదవ్, డీఈ సువర్ణ, సునీల్బిడ్లాన్, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, నాగేందర్బాబ్జి, బి. కృష్టాగౌడ్, మహేశ్‌కుమార్, బబ్లూ, అంటోని, సుభాష్‌పటేల్, కృష్ణకుమార్, క్షీర్సాగర్, భీంరాజ్, రవియాదవ్, ఆర్. సంతోష్, నాగు, వాసు, శివానంద్ పాల్గొన్నారు.
మట్టి ప్రతిమలనే పూజిద్దాం..
అంబర్‌పేట : రాబోవు వినాయక చవితికి మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక మహంకాళిగుడి వద్ద మట్టి ప్రతిమలనే పూజించాలి అనే అంశంపై అధికారులు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే మట్టి వినాయకుల తయారీపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అన్ని చోట్ల ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మట్టి ప్రతిమల తయారీపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు శిక్షణ తీసుకోవచ్చని చెప్పారు. డీసీ వేణుగోపాల్, నోడల్ అధికారి రజిత, ఏఎంఓహెచ్ జ్యోతిబాయి, దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు శ్రీరాములుముదిరాజ్, మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, రమేశ్‌నాయక్, బంగారు శ్రీను, నవీన్‌యాదవ్, శివ పాల్గొన్నారు.
దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులైన దళితులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడకు చెందిన లబ్ధిదారుడు శివగణేశ్ దళితబంధు పథకం ద్వారా చెప్పల్‌బజార్‌లో ఏర్పాటు చేసిన టోంట్ హౌస్ ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అర్హులకు అందే లా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, మహేశ్‌కుమార్, బబ్లూ, అంటోని, విజితారెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.