అంబర్‌పేట జోన్ బృందం, జూన్ 17: దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో నగర రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా చివరి రోజు శుక్రవారం కాచిగూడ డివిజన్లోని పలు బస్తీ, కాలనీలలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొని డివిజన్లోని రోడ్లపై ఉన్న చెత్త, మట్టి కుప్పలను సిబ్బందితో తొలగింపజేశారు. కన్నె రమేశ్‌యాదవ్, దిడ్డి రాంబా బు, మేనేజర్ భావన, డీఈ సువర్ణ, సునీల్బిడ్లాన్, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, నాగేందర్బాబ్జి, డీఎంసీ వేణుగోపాల్, బి.కృష్టాగౌడ్, భీంరాజ్, వాసు, రవియాదవ్, నాగు, సురేశ్ పాల్గొన్నారు.
ప్రగతితో సమస్యలు పరిష్కరమవుతాయని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యాశ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చివరిరోజు శుక్రవారం గోల్నాక డివిజన్లోని నింబోలిఅడ్డా, దుర్గాసింగ్లైన్, ఎస్సీహాస్టల్ లైన్ తదితర బస్తీలలో కార్పొరేటర్ లావణ్య పాల్గొని బస్తీలోని చెత్తను తొలగింపజేశారు. దూసరి శ్రీనివాస్‌గౌడ్, డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, స్ట్రీట్‌లైట్, ఎలక్ట్రికల్ అధికారులు, ఉమేశ్, నరేశ్, అర్వింద్ పాల్గొన్నారు.
పజల భాగస్వామ్యం తో పట్టణ ప్రగతిని విజయవంతం చేశామని కార్పొరేటర్ ఇ. విజయ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కాలనీ, ఆకాశ్‌నగర్, ఓవైసీ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. నోడల్ అధికారి హరీశ్ శంకర్, పలు శాఖల అధికారులు కు శాల్, విగ్నేశ్వరి, నాగరాజు, రమేశ్, దుర్గ, ఉమేశ్, పాష, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్ పాల్గొన్నారు.
డివిజన్లోని ఎస్బీఐ కాలనీలో నోడల్ అధికారి రజిత నేతృత్వంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొ ని సమస్యలు తెలుసు కొని అప్పటికప్పుడే పరిష్కరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, డాక్టర్ సులోచన, రమేశ్‌నాయక్, బంగారు శ్రీను, శివ, మిర్యాల రవీందర్, బీజేపీ నాయకులు చుక్క జగన్ పాల్గొన్నారు.