శంషాబాద్ రూరల్, జూన్ 15: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని హమిదుల్లానగర్ గ్రామంలో చిన్నగోల్కొండ పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్, వ్యవసాయ అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. దీంతో పాటు హమిదుల్లానగర్, రషీద్‌గూడ, పోశెట్టిగూడలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు. నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
రైతులు ఏ రకమైన పంటలు సాగు చేయాలి, సాగుచేసే పద్ధతులను వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని, వ్యవసాయం ఆధాయంగా మారేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన్నట్లు తెలిపారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, వ్యవసాయ అధికారులు డీఈ లీనారెడ్డి, కవిత, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్‌లు సతీశ్‌యాదవ్, రాణిరవి, దండు ఇస్తారి, మండలపార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, నీరటి రాజు ముదిరాజ్, మంచర్ల మోహన్‌రావు, ఎస్టీసెల్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, అశోక్ యాదవ్, ఉప సర్పంచ్ జగన్మోహన్రెడ్డి, నాయకులు ధన్‌పాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సుధాకర్‌గౌడ్, సుధాకర్, ముక్తార్, బాల్‌రాజ్, నవీన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని హమిదుల్లానగర్, రషీద్‌గూడ, పోశెట్టిగూడ గ్రామాల్లో ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.