సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ ) : పట్టణ ప్రగతి కార్యక్రమం బల్దియా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. 13 రోజుల్లో 5036 బస్తీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో 90,916 టన్నుల చెత్త, 30,168.9 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. 49,699 ప్రాంతాల్లో ఫాగింగ్, 232 కిలోమీటర్ల నాలాలో పూడికతీత పనులు పూర్తి చేశారు. 12,81,453 ఇండ్లలో యాంటీ లార్వా మందు పిచికారీ చేయడంతో పాటు 478 వైకుంఠ ధామాల్లో వ్యర్థాలు, చెత్తను తొలగించారు. అంతేకాకుండా 81,530 మొక్కలను పంపిణీ చేయగా, 59,496 మొక్కలను నాటినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 345 కాలనీలు, బస్తీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు.
13వ రోజు చేపట్టిన కార్యక్రమాలు