మేడ్చల్ జోన్ బృందం, జూన్ 15: నియోజకవర్గంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారం ముమ్మరంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ప్రజలను సమస్యలడిగి తెలుసుకున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, వీణాసురేందర్ గౌడ్, బేరి బాలరాజ్, చింత పెంటయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఉన్న అహ్మద్‌గూడలో శిథిలావస్థకు చేరిన నాలుగు ఇండ్లను కూల్చివేశారు. యంత్రాలను నాలాలను శుభ్రం చేశారు. చైర్పర్సన్ ప్రణీతాశ్రీకాంత్ గౌడ్ పలు కాలనీల్లో పర్యటించారు. కమిషనర్ స్వామి, డీఈఈ సుమతి, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో పట్టణ ప్రగతిని నిర్వహించారు. ఇందులో భాగంగా పలు కాలనీల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలలో పరిశుభ్రతపై వివిధ వార్డుల్లో ప్రజలతో సమావేశాలను నిర్వహించారు. ఘట్కేసర్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత 10వ వార్డులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి,కమిషనర్ సురేశ్ ఆధ్వర్యంలో 12వవార్డు సంస్కృతి టౌన్షిప్లో పట్టణ ప్రగతిని పారిశుధ్య పనులు చేపట్టారు. వైస్ చైర్మన్ రెడ్డ్యా నాయక్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 8వ డివిజన్ సంతోష్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 8వ డివిజన్ సంతోష్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీమన్, వెంకటేశ్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, రమేశ్‌చారి, నర్సింహులు, భారతమ్మ, అంగన్వాడీ టీచర్ బాలమణి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో 11వ డివిజన్ పరిధిలోని తిరుమల మెడోస్కాలనీ, లక్ష్మీగణపతికాలనీలో కార్పొరేటర్ శ్రీవిధ్యచక్రపాణిగౌడ్తో మేయర్ బుచ్చిరెడ్డి పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు దత్తాత్రేయశాస్త్రీ, నాయకులు గుర్రాల వెంకటేశ్ యాదవ్, చక్రపాణిగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో చైర్మన్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నీటి శుద్ధి, పరిసరాల పరిశుభ్రత, శిథిలావస్థకు చేరిన నిర్మాణాల కూల్చివేత, లోతట్టు ప్రాంతాల్లో మట్టి వేయడం వం టి కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, కమిషనర్ జేతూరామ్, కౌన్సిలర్లు ఉమశ్రీనివాస్, నర్సింగ్రావుగౌడ్, రజిని వేణుగోపాల్‌రెడ్డి, సురేశ్, ఉమ ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యుడు షఫిఉల్లాబేగ్, శ్రీధర్‌రెడ్డి, డీఈ సునీత, పర్యావరణ ఇంజనీర్ గణేశ్ పాల్గొన్నారు.