మేడ్చల్ రూరల్, జూన్ 15: క్రీడా ప్రాంగణాలతో ఆరోగ్య తెలంగాణ సాధ్యపడుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో బుధవారం వివేకానంద విగ్రహం, గ్రామ స్వాగత తోరణం, బృహత్ పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిట్టిమిల్ల గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను, యువతను క్రీడలవైపు మళ్లించాలని, ప్రజలు మానసిక, శారీకంగా ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు పూనుకుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో అన్ని సౌకర్యాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం సువిశాలంగా ఉందన్నారు.క్రీడాకారులకు అనువుగా ఉండేలా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని, సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్‌లు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయా నందారెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ, డీఎల్పీవో స్మిత, డీపీవో రమణమూర్తి, వైఎస్‌ఎంపీపీ వెంకటేశం,ఎంపీటీసీ రఘు, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, సుదర్శన్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయానందారెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు రాగజ్యోతి, సర్పంచ్‌లు గీతాభాగ్యారెడ్డి, మహేందర్, జ్యోతిశేఖర్ రెడ్డి, లక్ష్మీసంజీవయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, జగన్‌రెడ్డి, భాగ్యారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ నర్సింగ్‌రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.