బండ్లగూడ, జూన్ 14: క్రీడాలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1,17వ డివిజన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మేయర్ మహేందర్‌గౌడ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, రావుల కోళ్ల నాగరాజు పాల్గొన్నారు.
నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
శంషాబాద్ రూరల్, జూన్ 14: నేడు మండలంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని చిన్నగోల్కొండ పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్, మండల పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు,సర్పంచ్ సతీశ్‌యాదవ్ తెలిపారు. హమిదుల్లానగర్, రషీద్‌గూడ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు రైతు వేదిక, సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారని వివరించారు. సమావేశంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఆశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.