జూబ్లీహిల్స్, జూన్ 14: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెల్లువెత్తాయి. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండటంతో పాఠశాలల వద్ద సందడి నెలకొంది. ఖైరతాబాద్-2 మండలంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలకు అప్‌గ్రేడ్ అయిన విద్యార్థులతో పాటు పాఠశాలలు తెరుచుకున్న 2 రోజుల్లో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు నమోదయ్యారు. యూసుఫ్‌గూడ పాఠశాలలో 72 మంది, శ్రీరాంనగర్ పాఠశాలలో 120 మంది, జవహర్‌నగర్ పాఠశాలలో 74 మంది, బోరబండ అల్లాపూర్ పాఠశాలలో 58 మంది, బోరబండ జ్యోతినగర్ పాఠశాలలో 50 మందితో పాటు బోరబండ నాట్కో పాఠశాలలో అత్యధికంగా 410 అడ్మిషన్లు నమోదయ్యాయి. మంగళవారం ఖైరతాబాద్ డిప్యూటీ డీఈఓ చిరంజీవి పలు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు.