సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): “ఒకే చోట ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు గల కారణాలను విశ్లేషించి.. ప్రమాదాలు తగ్గించాలి.” అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం ట్రాఫిక్ విభాగం పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ తగ్గించేందుకు వాహనదారులు లింక్ రోడ్లను వాడేలా అవగాహన కల్పించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ వారికి శిక్షలు పడేలా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీలు హనుమంతరావు, శ్రీనివాస్ నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.