మెహిదీపట్నం, జూన్ 14: గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన అజయ్‌సింగ్(25) మద్యం తాగి స్థానికులతో గొడవ పడుతున్నాడు. సోమవారం అర్ధతాగిన మత్తులో అతడు జిర్రా రాయల్ సీ హోటల్ వద్ద నానా హంగామా చేశాడు. ఆసిఫ్‌నగర్ పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసుల పెట్రో కారుపైకి ఎక్కి రభస చేసి, కారు అద్దాలు ధ్వంసం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల ఫిర్యాదుతో మంగళవారం అతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.