ఘట్కేసర్ రూరల్, జూన్ 14 : ఆశిష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపిన వివరాలు… చీర్యాల కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బంజారాహిల్స్ రోడ్డు నం.9కి చెందిన ఏజుముల పరుశురాం కుమారుడు త్రినాథ్(23) పట్టుబడ్డాడు. అతడి వద్ద 25 ఆశిష్ ఆయిల్ బాటిల్స్, 6 ఎల్ఎస్డీ పేపర్ బ్లాట్స్ లభించాయి. నిందితుడికి ఆశిష్ ఆయిల్ సరఫరా చేసిన షేక్‌పేట్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన గుండు అజయ్‌కుమార్ కుమారుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకోగా బోయిన్‌పల్లిలో ఉండే మరో వ్యక్తి రంజిత్ పరారీలో ఉన్నాడు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు పురుశోత్తం రెడ్డి, శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.