శంషాబాద్ రూరల్, జూన్ 12 : పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ ఆదర్శంగా మారుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ అన్నారు. ఆదివారం పట్టణంలోని 24 వ వార్డులో కౌన్సిలర్ కొన్నమొల్ల భారతమ్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ చెత్తను తొలగించడంతో పాటు మురుగునీరు రోడ్లపై, ఇండ్ల మధ్యలో నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండిగోపాల్ యా దవ్, ఏఎంసీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్ మేకల వెంకటేశ్, మున్సిపల్ ఏఈ నరేశ్, ఇంజినీయర్ అనిల్, నగర దీపికలు, నాయకులు కొన్నమొల్ల శ్రీనివాస్, పరంధాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని సుల్తాన్‌పల్లి, న ర్కూడ, చౌదర్‌గూడ, మదన్పల్లికొత్తతండా, మదన్‌పల్లి, పెద్దగోల్కొండ, హమిదుల్లానగర్, పాలమాకుల గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్క రించడాని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో…
బండ్లగూడ,జూన్ 12: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కార్పొరేటర్ అనిత వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. బస్తీలోని ప్రజలందరూ తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బొర్ర రాందాస్ ముదిరాజ్,గోపాల్ ముదిరాజ్,సంపత్‌గౌడ్,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.