హయత్నగర్, జూన్ 12: మానసిక స్థితి సరిగాలేని ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ హయత్నగర్లో నివాసముంటున్న యన్రాల సక్కుభాయ్ కూతురు అంభికరాణి విద్యార్థిని. మానసికస్థితి సరిగా లేనందున గతంలో కూడా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ఆర్టీసీ క్రాస్ రోడ్డు చౌరస్తాలో దొరికింది. శనివారం సాయంత్రం కూడా ఇంట్లో చెప్పకుండా అంభిక రాణి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కూతురు ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.