మేడ్చల్ జోన్ బృందం, జూన్ 12 : పట్టణ ప్రగతి కార్యక్రమం ఆదివారం ఏడు మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్లు, మేయర్లు అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 19, 22 వార్డుల్లో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి పర్యటించారు. నీరు, డ్రైనేజీ తదితర సమస్యలను సభకు దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు దేవరాజ్, మాధవి నరేందర్, కమిషనర్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నాగారం చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి 11, 12, 13 వార్డుల్లో పర్యటించారు. పారిశుధ్య అవగాహన ర్యాలీల్లో పాల్గొన్నారు.
13వ వార్డులో రూ.15 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 12వ వార్డులో రూ.5 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 12వ వార్డులో కౌన్సిలర్ మోకు రేణుకాజగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, డీఈఈ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, ఎస్సై రాంరెడ్డి, వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గౌడ్లో చైర్పర్సన్ ప్రణీతాశ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించారు. ఓవర్హెడ్ ట్యాంక్లను శుభ్రం చేశారు. ఖాళీ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 5వార్డులో జరిగిన సమావేశంలోచైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. కమిషనర్ వసంత, వార్డు కౌన్సిలర్ అనురాధ, ప్రత్యేక అధికారి వేణుగోపాల్, కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్, కోఆప్షన్ సభ్యుడు షౌకత్మియా, మేనేజర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 16 వార్డులో చైర్మన్ రాజేశ్వర్ రావు పర్యటించారు. హకీంపేట చెరువు కట్టపై పారిశుధ్య పనులను నిర్వహించారు. పీర్జాదిగూడ పరిధిలో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి డివిజన్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఇనుప సామగ్రిలాంటి తదితర వస్తువులను సేకరించారు. 10, 11వ డివిజన్లలో మేయర్ వెంకట్రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి స్వచ్ఛ పీర్జాదిగూడ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ రామకృష్ణారావు, డీఈ శ్రీనివాస్, కార్పొరేటర్లు పారిశుధ్య కార్మికులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.