జవహర్‌నగర్, జూన్ 12 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త దనాన్ని సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ… జవహర్‌నగర్‌లో చెత్త డంపింగ్‌యార్డ్ దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, నూతన టెక్నాలజీతో క్యాపింగ్ చేసి వాసన రాకుండా చేశామన్నారు. అనంతరం 15వ డివిజన్లో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించి, కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని మేయర్ కావ్య అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి, డీఈఈ చెన్నకేశవులు, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ఏకే మురుగేశ్ అన్నారు. ఆదివారం కార్పొరేషన్‌లోని 5వ డివిజన్లో కాలనీవాసుల సహకారం, సొంత నిధులు రూ. 25లక్షలు, రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్లు రవి, ఆశాకుమారి, నిహారికగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్నబాల్రాజ్, డివిజన్ నాయకులు ఆనంద్, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.