గౌతంనగర్, జూన్12 : గౌతంనగర్ డివిజన్ పరిధి మల్లికార్జుననగర్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ సునీతారాముయాదవ్తో కలిసి రూ.31లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరానెహ్రూనగర్‌లో అభివృద్ధి పనుల కోసం రూ.2కోట్ల నిధులను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి చేశామని తెలిపారు. వర్షాకాలనికి ముందుగానే బాక్స్డ్రైన్ పనులను పూర్తి చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు.కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, జలమండలి డీజీఎం స్రవంతి, మేనేజర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు రాముయాదవ్, మల్లికార్జుననగర్ అసోసియేషన్ సభ్యులు, వెంకట య్య, అచ్యుత్‌రావు, గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జుననగర్‌లో పట్టణ ప్రగతి
మల్లికార్జుననగర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే హన్మంతరావు, కార్పొరేటర్ సునీతారాముయాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి
మల్కాజిగిరి, జూన్ 12: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. ఆదివారం అల్వాల్ డివిజన్ జానకినగర్కాలనీలో సీసీ రోడ్లు,శ్రీబేకిరి వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణపనులను ఆయన పరిశీలించారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు 25రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీ నాగమణి, కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొండల్‌రెడ్డి, బలవంతరెడ్డి, రాజసింహారెడ్డి, లోకేశ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి
పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని వెంకటాపురండివిజన్ కార్పొరేటర్ సబితాకిశోర్ సూచిం చారు. ఆదివారం వెంకటాపురం డివిజన్ గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో రోడ్డు పక్కల మట్టి కుప్పలను తొలగింపు పనులు, యాదమ్మనగర్‌లో స్థానికుల నుంచి సమస్యలను కార్పొరేటర్ సబితాకిశోర్ అడిగి సమస్యలు తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఏఈ అరుణ్, అనిల్‌కిశోర్, సత్యనారాయణ, అనిల్,రామ్, భాస్కర్, శివ, రాజునాయక్, నరేష్, మోసి న్, ముత్యాలు, ప్రభాకర్, షేక్, సాబిర్, విజయ్, శేఖర్, జనార్దన్, శ్రీనివాస్, వసుంధర, రమ,స్వప్న పాల్గొన్నారు.
సౌకర్యాలు కల్పించడానికే పట్టణ ప్రగతి
కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికే పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కాలనీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, బలవంతరెడ్డి, రాజసింహారెడ్డి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.