చిక్కడపల్లి,జూన్12: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా అందరికీ ఉపయోగపడేలా ఇండియన్ బ్యాంక్ తోడ్పాటును అందిస్తున్నదని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ఏ-సీడీఓ) ధన్రాజ్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ, తెలంగాణ యూనిట్ త్రైమాసిక జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగింది. ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఐబీఓఏ సెక్రటరీ జనరల్ ఆర్.శేఖరన్, లక్నో అధ్యక్షుడు ఆర్ఎన్. శుక్లా, తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.నాగేశ్వర్, కార్యదర్శి ఎం.హరవర్ధన్, కేఎస్.సుధాకర్ రావు, డీజీఎం శివ ప్రసాద్, ఐ.చంద్రప్రకాశ్, ఎం.అరుణ, బి.సుధారాణి, వెంకటరమణ రావు, వీవీఆర్కేతో పాటు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, కరీంనగర్, రాజమండ్రి, అమరావతి, జోన్ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ ఏపీ, తెలంగాణ శాఖల నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా పి.చంద్రనాయక్, ప్రధాన కార్యదర్శిగా జి.సతీష్ చంద్రకుమార్, జోనల్ సెక్రటరీగా వై.శ్రీరాం, ఉపాధ్యక్షుడిగా లక్ష్మీ చంద్రయ్య తదితరులు ఎన్నికయ్యారు.