దుండిగల్, జూన్ 12: దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (ఎంఎల్ఆర్ ఐటీఎం అండ్ ఫార్మసీ) కళాశాలల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూరు హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పౌరులుగా గ్రాడ్యూయేట్లను తీర్చిదిద్దడంలో అధ్యాపకుల కృషి చాలా గొప్పదని తెలిపారు. నేటి సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. అనంతరం కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీపుల్స్ ఆపరేషన్స్ బార్నుటెక్ సొల్యూషన్స్ గ్లోబెల్ లీడర్ డాక్టర్ శైలజ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ.రెడ్డి, ఎంఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, మర్రి మమతా రాజశేఖర్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్ణబ్ మాలిక్, కళాశాల డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ రవిప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.