వినియోగదారుడు ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన నుంచి, సేవలను వినియోగించుకున్న వినియోగదారులు రెండేండ్ల లోపు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు.
సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : వస్తువు కొనుగోలు చేసిన తరుణంలోగానీ, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకొని సేవల్లో అంతరాయం ఏర్పడినా.. బీమా పాలసీ కంపెనీలు సేవలందించేందుకు కొర్రీలు పెట్టినా.. వినియోగదారుల సేవల్లో అలసత్వం వహించినా.. నిబంధనల ప్రకారం హైదరాబాద్ కన్జ్యూమర్ కమిషన్-1 ఆశ్రయించవచ్చు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరించేందుకు అవకాశం ఉన్నదని వినియోగదారుల కమిషన్ అధికారులు చెబుతున్నారు. మీకు సేవల్లో అన్యాయం జరిగిందని భావిస్తే నిర్భయంగా నాంపల్లిలోని కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచనలు చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కన్జ్యూమర్ కమిషన్-1, కమిషన్-2, కమిషన్-3 నిత్యం వినియోగదారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాయని హైదరాబాద్ కన్జ్యూమర్ కమిషన్-1 సూపరింటెండెంట్ మధుకుమార్ వెల్లడించారు.
రెండేండ్లలోపు ఫిర్యాదు చేయాలి..
రూ.5లక్షల లోపైతే.. కోర్టు ఫీజు ఉండదు..