మేడ్చల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నగర శివారు మేడ్చల్ నియోజకవర్గం కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో వివిధ జాతులకు చెందిన స్వదేశీ, విదేశీ పక్షులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పార్కులో ఆస్ట్రేలియా, దక్షిణ చైనా, సౌత్ అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన కాక్టెయిల్, సిల్వర్ పిసెంట్, బ్లూ గోల్డ్మాకా, బ్లూ గ్రీన్ చీక్, ఎల్లో సీడెడ్ కానర్, సన్ కానర్, బ్లూ ఫైనాపిల్ కానర్, జండి కానర్, గ్రీన్ కానర్, వైట్ కాక్టెయిల్తో పాటు వివిధ జాతులకు చెందిన స్వదేశీ పక్షులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులను తీరొక్క రంగులతో ఉన్న ఈ పక్షుల కిలకిల రాగాలు కనివిందు చేస్తున్నాయి. 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆక్సిజన్ పార్కులో త్వరలోనే సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.