ఉప్పల్, చర్లపల్లి, జూన్ 11: కాలనీల్లో సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్లో శనివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు గుర్తించారు. అనంతరం కాలనీల్లో సమస్యలను పరిష్కరించేవిధంగా తగిన సూచనలు చేశారు. కాలనీలలో ఇండ్ల ముందు చెత్త వేసినవారిపై జరిమానా వేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, డీఈ నాగమణి, ఏఈ కీర్తి, టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బీవీ.చారి, ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి, శివ, వెంకటసాయి, అక్బర్, గణేశ్ పాల్గొన్నారు. నాచారంలో పట్టణ ప్రగతిలో భాగంగా రవీంద్రనగర్కాలనీలో అధికారులతో కలిసి కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో పనులు చేయిస్తూ పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ సురేందర్, ఏఈ దయ, నేతలు సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి పాల్గొన్నారు. చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీ, శ్రీగిరికాలనీలో కార్పొరేటర్ గీతాప్రవీణ్ ముదిరాజ్ పర్యటిం చారు. ఈ సందర్భంగా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రమాదేవి, శానిటేషన్ డీఈ చందన, ఏఈ రాజ్‌కుమార్, నేతలు ప్రవీణ్, కొండల్‌రెడ్డి, వీబీ.నర్సింహ, మహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ శ్రీదేవి పర్యటించారు. ఈసందర్భంగా కాలనీలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని, పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఉషా, డీజీఎం సతీష్, ఏఎంఓహెచ్ స్వప్న పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ బ్లాక్-1లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డి అధికారులతో కలిసి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ లీకేజీ అవడంతో వెంటనే శానిటేషన్ సిబ్బందితో పనులు చేపించి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ స్రవంతి, వివిధ విభాగాల అధికారులు, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్‌గౌడ్, రమణ, మురళి, రాపోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.
మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్లో..
పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్ పరిధిలోని కృష్ణానగర్‌లో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెకొన్న సమస్యలపై ఆయన స్థ్ధానికుల నుంచి తెలుసుకొని కాలనీలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శానిటేషన్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాకేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, జలమండలి అధికారి వేణగోపాల్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, బాలయ్యగౌడ్,నతానియల్ ఉన్నారు.
కాప్రా డివిజన్లో….
పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్ పరిధిలోని కృష్ణానగర్, సింధూరకాలనీ, ఆర్టీసీకాలనీల్లో కార్పొరేటర్ స్వర్ణరాజు అధికారులతో కలిసి పర్యటించి స్థ్ధానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, కుమార్, శివలింగం, భిక్షపతి, పాండుగౌడ్, మల్లారెడ్డి, బాలయ్య ఉన్నారు.