బడంగ్‌పేట, జూన్ 10 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవని, ఇక్కడ అన్నివర్గాలు లబ్ధిపొందుతున్నాయని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్‌లీడర్ కీసర గోవర్ధన్‌రెడ్డి కొనియాడారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, సీఎం కేసీఆర్‌ను ఒప్పించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయన్నారు.