శంషాబాద్ రూరల్, జూన్ 10 : పల్లెప్రకృతి వనాలను మరింత అభివృద్ధి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పెద్దతూప్ర, శంకరాపూర్, చెర్లగూడ గ్రామాల్లో ఆయన పర్యటించి ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠథామాలు, నర్సరీలు ఏర్పాటు చేయడంతోపాటు ఊరు మొత్తం మొక్కలు నాటడంతో గ్రామంలో ఎటు చూసినా చెట్లతో పచ్చదనంతో కనిపిస్తున్నాయని తెలిపారు. మండలంలోని చెర్లగూడలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏవిధంగా ఉన్నాయో వాటిని పరిశీలించారు. బృహత్ ప్రకృతివనంలో భారీగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతిలో ఏండ్ల నుంచి ఉన్న సమస్యలను దాదాపు పరిష్కరించామని వివరించారు. కలెక్టర్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెంకటయ్య, మహేందర్‌రెడ్డి, ఎంపీవో సౌజన్య ఆయా గ్రామాల అధికారులు పాల్గొన్నారు.
కాలనీల్లో సమస్యలు పరిష్కారం
పట్టణ ప్రగతితో కాలనీల్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని శంషాబాద్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ఆయిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వార్డులోని పలు కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. బహదూర్ అలీమక్తతో పాటు ఆయా కాలనీల్లో చెత్తను తొలగించడంతోపాటు మురుగునీరు రోడ్లపై, ఇండ్ల మధ్యలో నిల్వకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు మండలంలోని పల్లెప్రగతిలో గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించడంతోపాటు తాగునీరు, ఇండ్లపై ఉన్న విద్యుత్ తీగల తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఘాన్సిమియాగూడలో సర్పంచ్ దేవిగజగన్గౌడ్ ఆధ్వర్యంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్, ఎంపీటీసీ యాదయ్యగౌడ్, నాయకులు జగన్‌గౌడ్, రాంనాథ్ ముదిరాజ్తో పాటు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని నర్కూడ, చౌదర్‌గూడ, మదన్‌పల్లి కొత్తతండా, మదన్‌పల్లి, పెద్దగోల్కొండ, హమిదుల్లానగర్ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు.