మేడ్చల్ రూరల్ ,శామీర్‌పేట, కీసర , ఘట్కేసర్ రూరల్, జూన్ 10 : మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి పండుగలా కొనసాగింది. అధికారులు, సర్పంచ్‌లు పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు. పారిశుధ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో శుక్రవారం డీపీవో రమణమూర్తి పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించి, బాధ్యతగా పనులు చేపట్టాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అదే విధంగా అలియాబాద్, లాల్‌గడి మలక్‌పేట, తుర్కపల్లి, మజీద్‌పూర్, బాబాగూడ తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతామహేందర్, ఎంపీవో సునీత, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఘట్కేసర్ మండలం కాచవానిసింగారంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కీసర మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. యాద్గార్‌పల్లిలో డీపీఓ రమణమూర్తి, సర్పంచ్ పుట్ట ముదిరాజ్, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, ఎంపీడీవో పద్మావతి పల్లెప్రగతి పనులను పరిశీలించారు.