మల్కాజిగిరి/ గౌతంనగర్/ కాప్రా/అల్వాల్ , జూన్ 10: పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేమెట్లోని బాలాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్మే పూజలు నిర్వహించి రూ.12లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీహాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వెంకటాపురం డివిజన్ పట్టణ ప్రగతిలో ఆర్టీసీ కాలనీలో సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్ సబితాకిశోర్. కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, తాసీల్దార్ నాగమణి, డీసీలు రాజు, నాగమణి, ఏసీపీ హేమలత పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు..
కాలనీల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగం గా అశోక్నగర్కాలనీ, సాయిప్రియకాలనీ, గౌడపురి కాలనీల్లో కార్పొరేటర్, టీఆర్‌ఎస్‌నాయకులు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈఈ హరిలాల్‌నాయక్, ఏఈఈ అభిషేక్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, కొప్పులకుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి..
అభివృద్ధి పనుల కోసమే పట్టణ ప్రగతి చేపట్టామని కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ అన్నారు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధి జ్యోతినగర్‌లో అధికారులతో కలిసి కార్పొరేటర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసు లు కోరారు.అల్వాల్‌లో.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు రామ్‌నగర్ కాలనీలో పర్యటించి పచ్చదనం, పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఏఎంసీ హేమలత, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శేఖర్, విజయరామారావు, వెంకటేశ్, నవీన్ రాజు, సంతోష్ పాల్గొన్నారు.