ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 7: స్నేహితులను కలిసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ ఎస్సై సీహెచ్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం క్యాంపస్‌లోని అయిదవ నంబర్ క్యాంపులో నివాసముండే మహమ్మద్ అర్షన్ (23) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయంలో స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొద్ది సమయం తరువాత ఫోన్ చేసి తాను గచ్చిబౌలిలో ఉన్నానని, కొంతసేపట్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు. అంతలో అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంటికి తిరిగిరాకపోవడంతో యువకుడి తల్లి ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.