వెంగళరావునగర్, జూన్ 7 : దళితుల్లో ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కలెక్టర్ శర్మన్‌తో కలిసి 18 వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ దళితబంధు పథకం కింద ఒక్క రూపాయి వడ్డీ లేకుండా ఒక్కో ల్ధదారుడికి రూ. 10 లక్షల విలువైన వాహనాలను అందజేశామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితులను ఆదుకుని సంపన్నులుగా చేయాలని కంకణం కట్టుకున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 1500 మంది దళితులను ఆదుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఈ పథకం కింద వాహనాలను అందజేస్తున్నామన్నారు. ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తులు చేసుకుంటే అధికారులు గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేస్తున్నారన్నారు. దళితులు స్వశక్తితో ఉపాధి పొందేందుకు ఈ పథకం ఉపకరిస్తుందని తెలిపారు.
దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయని..తమది చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. నియోజకవర్గంలో 56 వాహనాలు మంజూరు కాగా 18 వాహనాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యవిజయ్, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతయాదవ్, టీఆర్ఎస్ శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, సంజీవ, సంతోష్ ముదిరాజ్, మన్సూర్, మాజీ కార్పొరేటర్ శ్యామ్‌రావు, విజయ్ కుమార్, తన్నూఖాన్, విజయసింహ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మా దేవుడు
సీఎం కేసీఆర్ సార్ దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. గతంలో ఆటో తీసుకునేందుకు రుణాల కోసం బ్యాంకులకు ఎన్నోసార్లు తిరిగాం. రుణం రాలేదు. సీఎం కేసీఆర్ దళితబంధు కింద అందించిన డబ్బులతో గూడ్స్ ఆటోను కొనుగోలు చేశాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
– శివకుమార్, లబ్ధిదారుడు
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
కష్టాల్లో ఉన్న మాకు కొండంత అండగా నిలిచారు. దళిత బంధు పథ కం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలతో మూడు గూడ్స్ ఆటోలను కొనుగోలు చేసుకున్నాం. ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహకారంతో అధికారుల చొరవతో మాకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-గజ్జెల బాలకృష్ణ, లబ్ధిదారుడు