వెంగళరావునగర్, జూన్ 7 : పట్టణ ప్రగతితో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కార్పొరేటర్ వనం సంగీతయాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ పట్టణ ప్రగతితో ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయన్నారు. కాలనీలను, బస్తీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ శ్రీనివాస్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, డివిజన్ అద్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, శరత్ గౌడ్, మధు యాదవ్, నాగమణి, అంబిక పాల్గొన్నారు.
రహ్మత్‌నగర్‌లో…
జూబ్లీహిల్స్,జూన్7: పట్టణ ప్రగతితో పరిసరాల రూపురేఖలు మారుతున్నాయి. నిన్నటి వరకు చెత్తా, చెదారంతో నిండిన ప్రాంతాలు నేడు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. పట్టణ ప్రగతిలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నారు. రహ్మత్‌నగర్.. వెంగళరావునగర్ డివిజన్ల మధ్య వీడియో గల్లీ.. జవహర్‌నగర్ ప్రాంతాలను కలిపే అంతర్గత రోడ్డు గత దీర్ఘకాలంగా చెత్తా చెదారంతో నిండిపోయి మూతపడింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా యూసుఫ్‌గూడ 19 వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఈఈ రాజ్‌కుమార్ సిబ్బందితో కలిసిపనులు చేపట్టారు.
బస్తీలను శుభ్రంగా ఉంచుకోవాలి
బన్సీలాల్‌పేట్, జూన్ 7 : ప్రతి ఒక్కరూ తమ బస్తీలను శుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ హేమలత సూచించారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డీ క్లాస్, బీజేఆర్ నగర్, ముస్లిమ్ బస్తీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం వెంకట్రావు, మేనేజర్లు శశాంక్, సంధ్య, జీహెచ్ఎంసీ ఏఈ నవీన్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మిపతి, కమల్‌కుమార్, ప్రేమ్‌కుమార్, జావేద్, అబ్బాస్, బలరామ్, మురళి, రమేశ్, గోవర్ధన్, కుశాల్, సాయిబాబా పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్లో…
ఎర్రగడ్డ, జూన్ 7: పట్టణ ప్రగతిలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో అధికారులు పర్యటించారు. డివిజన్లోని శంకర్‌లాల్‌నగర్, సౌత్ శంకర్‌లాల్‌నగర్ బస్తీల్లోని వీధుల్లో పారిశుధ్య సిబ్బంది, కార్మికులు అక్కడున్న చెత్తను తొలగించి తరలించారు.