ఖైరతాబాద్, జూన్ 7: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైటెక్స్‌లో ైస్టెల్ తత్వ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శుభ్ర మహేశ్వరి తెలిపారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ వివరాలను వెల్లడించారు. 230 స్టాల్స్ ఏర్పాటు చేసి నగరంలోని అన్ని రకాల ఉత్పత్తులను విక్రయానికి ఉంచునున్నట్టు తెలిపారు. షాపింగ్ అంతా ఒకే చోట లభించేలా కస్టమర్లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఆభరణాలు, వస్త్ర, ఫర్నిచర్, సౌందర్య లేపనాలు, మెడిసిన్స్, తదితర లైఫ్ ైస్టెల్ ఉత్పత్తులన్నీ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో శిల్పారెడ్డి, సోనా చత్వానీ తదితరులు పాల్గొన్నారు.