శంషాబాద్ రూరల్, జూన్ 7 : దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన 6 కార్లు, 36 ట్రాక్టర్లు, 15 రవాణా వాహనాలను, ఒకరికి పౌల్ట్రీకి సంబంధించిన చెక్కును మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశామని ఎమ్మెల్యే చెప్పారు. దళితులలో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్, ఎంపీడీవో వసంతక్ష్మి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, జూన్ 7 : దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం దళిత బంధు పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ 18హనాలను అందజేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పేద దళితులను ఆదుకొని సంపన్నులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గానికి 1500 మంది దళితులను ఆదుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, కార్పొరేటర్లు దేదీప్యవిజయ్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, వనం సంగీతయాదవ్ తదితరులు పాల్గొన్నారు.