సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పబ్‌లలో మైనర్లకు ఎంట్రీ ఇవ్వొద్దని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పబ్‌లలో నాన్ ఆల్కాహాలిక్ పార్టీలకు కూడా మైనర్లను అనుమతించవద్దని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీలు, ఇతర ఉన్నతాధికారులు పబ్ యాజమాన్యాలతో సమావేశాలను నిర్వహించి వారికి పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తున్నారు. దీంతో పాటు నోటీసులను జారీ చేస్తున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఇటీవల పలుమార్లు పబ్ యాజమాన్యాలు, నిర్వాహకులతో సమావేశమై మార్గదర్శకాలు వివరించారు.
మార్గదర్శకాలు..
ఫామ్ హౌజ్‌లు.. ఇతర విడిది సౌకర్యాలు నిర్వహించే వారికి ఇచ్చిన నోటీసులు, ఆంక్షలు..