హిమాయత్‌నగర్/బంజారాహిల్స్,జూన్7: బస్తీలు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కింగ్‌కోఠి ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీల్లో రోడ్ల నిర్మాణంకు రూ.40 లక్షలు, సీవరేజ్ పైపులైన్ల నిర్మాణం కోసం రూ.35 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతి కార్యక్రమం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ వ్యర్థాల తొలగింపు, పాడైన రోడ్లకు మరమ్మతులు, చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు.