
ముషీరాబాద్, జనవరి 31: నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు లేకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హజార్గల్లీ, సెయిం ట్ పాయిస్ చర్చి గల్లీ, గణేశ్‌నగర్‌లో పాదయాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కలుషిత నీరు, డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ పైపులైన్లు శిథిలావస్థకు చేరుకోవడంతోనే బస్తీల్లో లీకేజీ సమస్య తలెత్తుతున్నదన్నారు.ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. శిథిలమైన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. హుస్సేన్ సాగర్, నాగమయ్యకుంట నాలాలకు ఇరువైపులా ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాగమయ్యకుంట, పద్మకాలనీ హెరిటేజ్ బిల్డింగ్ వద్ద నాలాను విస్తరించి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు. జలమండలి డీజీఎం వాహబ్, మేనేజర్ కృష్ణమోహన్, నాయకులు నర్సింగ్‌ప్రసాద్, వి.సుధాకర్‌గుప్తా, శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, గోవింద్, మోజస్, మహ్మద్ ఖదీర్, బి.శ్రీనివాస్‌రెడ్డి, దీన్దయాళ్రెడ్డి, శివముదిరాజ్, నరేశ్‌రెడ్డి, శోభ, ఉమారాణి పాల్గొన్నారు.