మేడ్చల్ రూరల్ / శామీర్‌పేట /కీసర/ ఘట్కేసర్ రూరల్, జూన్ 7 : గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, కీసర మండలాల్లో మంగళవారం పల్లె ప్రగతి కొనసాగింది. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్‌లో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పాల్గొని అబ్దుల్ కలామ్ పార్కును పరిశీలించారు.
కాచవానిసింగారంలో డీపీఓ రమణ మూర్తి పర్యటించారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీవో నందకిశోర్, సర్పంచ్‌లు కావేరి మచ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జలజ పాల్గొన్నారు. మేడ్చల్ మండలం డబిల్‌పూర్‌లో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, సర్పంచ్ గీతాభాగ్యారెడ్డితో కలిసి, పారిశుధ్య పనులను పరిశీలించారు. శిథిలావస్థలో ఇండ్లను కూల్చివేశారు. ఉప సర్పంచ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో మండల ప్రత్యేక అధికారి బలరామారావు నర్సరీలు, ఉపాధి హామీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. శామీర్‌పేటలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే చర్యలు తీసుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు బాలమణి, గీతామహేందర్, వనజశ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శశికుమార్, రమణారెడ్డి పాల్గొన్నారు. కీసర మండల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కొనసాగింది. ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.