సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ నది పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసింది. ఎంఆర్డీసీఎల్ మొదట మూసీ నదికి ఇరువైపులా ఉన్న కబ్జాలను గుర్తించేందుకు రెవెన్యూ శాఖతో కలిసి క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మూసీకి ఇరువైపుల బఫర్ జోన్లో 8,491 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన మూసీ నదికి ఇరువైపుల ఉన్న నివాస ప్రాంతాల నుంచి మురుగునీరు మూసీలోకి చేరుతుందని, తద్వారా మూసీ మురికి కూపంగా మారుతున్నదని గుర్తించారు. మూసీ పరిరక్షణకు మూసీకి ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయంగా 2బీహెచ్కే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు 12వేల 2బీహెచ్కే ఇండ్లను నిర్మించనున్నారు. అందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. వీటితో పాటు మూసీ సుందరీకరణకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ నిరంతరం కసరత్తు చేస్తున్నది.
ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు..