సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ‘ప్రకృతిని రక్షిస్తే అది నీ భవిష్యత్‌ను రక్షిస్తుంది’ అంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మిద్దెతోటల పెంపకంపై సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) ప్రతినిధులు, వలంటీర్లు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 300 మంది వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన ఔత్సాహికులకు 500 గులాబీ, ఇంట్లో పెంచుకునే ఇతర మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా 10వేల ఆకుకూరలు, కూరగాయల నారు, విత్తనాలు ఉచితంగా అందజేశారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, అగ్రికల్చర్ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, సీనియర్ మోస్ట్ గార్డెనర్ పార్థసారథి, అధికారులు నర్సింహదాస్, డాక్టర్ ఏవీ రావు తదితరులు పాల్గొన్నారు.
200 మందితో మొదలై..
ప్రతి ఇల్లు, కాలనీ, అపార్ట్మెంట్లు, గ్రీన్ గార్డెన్‌గా మార్చే లక్ష్యంతో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) సంస్థ ఆవిర్భవించింది. టెర్రస్, బాల్కనీ, బ్యాక్ యార్డ్‌లలో సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయాల సాగు, తోటల పెంపకానికి 2019లో 200 మందితో వాట్సాప్ గ్రూప్‌గా సీటీజీ ఏర్పాటైంది. ప్రస్తుతం 33పైగా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో 28వేల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు.
గార్డెనింగ్ ఔత్సాహికుల శిక్షణ..
గార్డెనింగ్ ఔత్సాహికులకు ఈ సంస్థ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విత్తనాలు, మొక్కలు, టెర్రస్ కూర్పు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం సీటీజీ సభ్యులు ప్రతి కాలనీ, ప్రతి వీధిలో అవగాహన కల్పించాలని తీర్మానించారు. టెర్రస్ గార్డెనింగ్పై ఆసక్తి గలవారు 6305898904 నంబర్‌ను సంప్రదించాలని సీటీజీ నిర్వాహకులు తెలిపారు.
ప్లాస్టిక్ వద్దు.. ప్రకృతే ముద్దు
ప్రకృతిని మనం రక్షిస్తే.. మనల్ని ప్రకృతి కాపాడుతుంది.’ ఈ థీమ్‌తో జగతి ఫౌండేషన్, హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ నగరంలోని పలు చోట్ల అవగాహన కార్యక్రమలు చేపట్టింది. ఇందులో భాగంగా సీడ్ బాల్స్‌ను తయారు చేశారు. చిన్నారుల భాగస్వామ్యంతో వాటిని సంబంధిత ప్రదేశాల్లో విత్తారు. అదేసమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని, విధిగా మొక్కలు నాటాలని వివరించారు.ఈ కార్యక్రమంలో జగతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గకల్యాణి, హెచ్‌సీజీ వ్యవస్థాపకుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ..
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో మొక్కలు నాటుతున్న ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ తదితరులు. అనంతరం హెచ్ఎండీఏ నర్సరీలలో 10వేల మొక్కలను కాలనీల ప్రతినిధులకు, ప్రజలకు పంపిణీ చేశారు.
ఓయూలో ‘సేవ్ సాయిల్’ రన్
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 5: మట్టిలేనిదే మానవ మనుగడ లేదని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్సీ, ఈఎంఆర్సీ, ఎన్ఎస్ఎస్ కలిసి సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు నిర్వహించిన ‘సేవ్ సాయిల్’రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మృణాళిని, ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ మూర్తి, ప్రొఫెసర్ రెడ్యానాయక్, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
పాలపిట్ట పార్కు వద్ద సైకిల్ ర్యాలీ
కొండాపూర్, జూన్ 5: పరిసరాలన్నీ హరితమయం చేసేలా టౌన్‌ప్లానర్ల డిజైన్లు ఉండాలని పురపాలక శాఖ కార్యదర్శి సీ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్‌ప్లానర్స్ ఇండియా తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో పాలపిట్ట పార్కు వద్ద ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీటీసీపీ ప్రాంతీయ సంచాలకులు కొమ్ము విద్యాధర్, క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు మారథాన్ రన్నర్ గుమ్మి రాంరెడ్డి, టీఆర్సీ సెక్రటరీ సూర్య కృష్ణప్రసాద్, టౌన్‌ప్లానింగ్ చాప్టర్ సభ్యులు, డెవలపర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఆస్వాదిస్తూ తింటున్నాం..
సీటీజీ మెంబర్‌గా జాయిన్ అయిన తరువాత ఆకుకూరల పెంపకాన్ని నేర్చుకున్నాను. ఏడాదిన్నరగా మా మిద్దెపైనే ఆకుకూరలు పెంచుతున్నాను. ఇప్పుడు మా కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు మేమే పండించుకుంటున్నాం. వాటిని ఆస్వాదిస్తూ ఆనందంగా తింటున్నాం.
– అనురాధ, లంగర్‌హౌస్
50 ఏండ్ల కిందటే రోజ్ గార్డెన్..
50 ఏండ్ల కిందటే రోజ్ గార్డెన్ ఏర్పాటు చేసి టెర్రాస్ మొక్కల పెంపకంలో హైదరాబాద్‌లో మొదటి వ్యక్తిగా పార్థసారథి నిలిచారు. ఆయనను ఆదర్శంగా తీసుకొనే అనేక మందిమి మిద్దె తోటల పెంపకం వైపు ముందుకు సాగాం. ఈ అంశాన్ని నగరంతోపాటు ఇతర గ్రామాల్లో కూడా తెలయపర్చేందుకు సంస్థ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం.
– హెచ్. శ్రీనివాస్‌రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్
పచ్చదనం నిండిపోవాలి..
ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ పచ్చదనంతో నిండి ఉండాలనేది మా అభిప్రాయం. 2019లో వాట్సాప్ గ్రూప్‌తో సీటీజీని స్టార్ట్ చేశాం. మన వరకే కాకుండా.. అందరికీ ఈ విషయం చేరేలా కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగుతున్నాం.
– సాయి రమణ, ఈవెంట్ ఆర్గనైజర్
ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ 22వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగాయి.ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ మణికొండ వేదకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేంద్ర కుమార్, సీవోఎంవోఎస్ ప్రతినిధి నవీన్ పిప్లాని ఎఫ్‌బీహెచ్ వార్షిక నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించి, స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు డాక్టర్ వీబీజే రావు, యు.ఫెర్వాస్, గౌర్ మోహన్ కపూర్, ఫరీదా తంపల్, ఉదయ్ శంకర్, ఫోరం వైస్ చైర్మన్ ఎం.హెచ్. రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వేదకుమార్ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ చైర్మన్ గులాం యజ్ఞానీ, సభ్యులు ఆదివారం ఉదయం పర్యావరణ నడుకలో పాల్గొన్నారు.
– హిమాయత్‌నగర్ /తెలుగుయూనివర్సిటీ, జూన్5
ప్రజల్లో చైతన్యం రావాలి
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 5: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం రావాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంవోహెచ్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఏఈ వెంకటేశ్, శానిటేషన్ సూపర్వైజర్ ధనా గౌడ్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్‌రావు, ఉదయభానుప్రసాద్, రామ్మోహన్‌రెడ్డి, హుస్సేన్, హరికుమారి, చిన్నయ్య, మైథిలి తదితరులు పాల్గొన్నారు.
–డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి