మారేడ్‌పల్లి, మే 5: రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి పాటు పడటమే కాకుండా వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని దళిత బంధు ప్రవేశపెట్టారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. ఆదివారం మారేడ్‌పల్లిలోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 12 మంది దళిత బంధు లబ్ధిదారులకు కార్లు, ట్రాలీ ఆటోలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జి.సాయన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.సాయన్న మాట్లాడుతూ, తన జీవితంలో ఇలాంటి గొప్ప పథకాన్ని ఎన్నడూ చూడలేదని, ఏ ప్రభుత్వాలు కూడా దళితుల కోసం కనీసం పట్టించుకోలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ దళితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళిత బంధులను ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. మొదటి దశలో 100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం ద్వారా వారు ఎంచుకున్న యూనిట్లను అందజేశామని తెలిపారు. త్వరలో మరో 1500 మందికి దళిత బంధులను అందజేసే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఏవరు కూడా ఆందోళలనకు గురి కావొద్దని అర్హులైన ల బ్ధిదారులందరికి తప్పకుండా దళితు బంధు అందజేస్తామన్నారు. దళిత బంధు ద్వారా పొందిన వారు వారితో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం అని, ఈ ప్రాంతంలో దళితుల సంఖ్య అధికంగా ఉంటుందని తెలిపారు.
త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలిసి ఎస్సీ నియోజక వర్గానికి అదనంగా దళిత బంధు యూనిట్లను అందజేయాలని వారిని కోరనట్లు చెప్పారు. అనంతరం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బృహత్తర దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, బోర్డు మాజీ సభ్యులు నళినీ కిరణ్, శ్యామ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సి. సంతోష్ యాదవ్, రేపాల వెంకటేశ్వర్లు, ఓదేలు అజయ్, ముప్పిడి గోపాల్, మధుకర్, పిట్ల నగేష్ ముదిరాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళిత బంధు పథకం అమలవుతుంది. దళితులను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నాం. తీసుకున్న యూనిట్ల ద్వారా దళితులు లబ్ధి పొందుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలి.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు