హిమాయత్‌నగర్, జూన్ 5 : వృద్ధులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం నారాయణగూడలోని భారత్ కాలేజీలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జీవన శైలిలో వచ్చే మార్పులతో పలు రకాల వ్యాధులు అధికమవుతున్నాయని, వ్యాధులు రాకుం డా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొం త మంది పిల్లలు తమ తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డా. రమేశ్, డా. ఎం.కె శాస్త్రీ, భారత్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, గౌరీశంకర్రావు, డా.అవులప్ప, డా.హరికుమార్, డా. శ్రీదేవి, పాల్గొన్నారు.