బడంగ్పేట్, జూన్ 5: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట్లో టీఆర్ఎస్ పార్టీ వింగ్, మున్సిపల్ కార్పొరేషన్, సీపీఎన్‌ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంద్రారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది అని బోధించారు. క్రీడాకారులు కష్టపడి ఆడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రతి వార్డు, డివిజన్లు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, ఈ పోటీల్లో 68 బాల బాలికల జట్లు పాల్గొనగా, బాలికల విభాగంలో నల్గొండకు చెందిన బాలికల జట్టు సూర్యాపేటపై, బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లాపై గద్వాల టీమ్ గెలుపొందింది.
విజేతలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.జగదీశ్ యాదవ్, సినీ నటుడు శ్రావణ్, బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ చిగిరింత పారిజాతా నర్సింహా రెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మీర్పేట్ సీఐ మహేందర్ రెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామిడి కవితా రాంరెడ్డి, బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, శోభా ఆనంద్ రెడ్డి, సంతోషి శ్రీనివాస్ రెడ్డి, సూర్ణగంటి అర్జున్, దర్శన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భీమీడి స్వప్న జంగారెడ్డి, సంరెడ్డి స్వప్నా వెంకట్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, భారతమ్మ, శోభా ఆనంద్ రెడ్డి, పెద్దబాయి శ్రీనివాస్ రెడ్డి, దర్శన్ రెడ్డి పాల్గొన్నారు.