ఖైరతాబాద్, జూన్ 5 : సంయుక్త్ రోజ్‌గార్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో ఈనెల 12న ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ హాల్లో ఉదయం 10గంటల నుంచి ‘ఎంప్లాయిమెంట్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు దేశ్ కి బాత్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ అహసాన్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో విద్య, ఆరోగ్య పాలసీ మాదిరిగా ఉద్యోగ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. 12న జరిగే సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు.