చిక్కడపల్లి,జూన్5: ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని అరుంధతి నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, అధికారులతో కలిసి బస్తీని పరిశీలించారు. స్థానిక బస్తీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అరుంధతి నగర్బస్తీ ప్రజల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు.
హుస్సేన్ నాలా అభివృద్ధిలో బస్తీవాసులు కొన్ని ఇండ్లు కోల్పోతున్నారని, వారికి దెగ్గరలోనే ఇండ్లు అందిస్తామని చెప్పారు. పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంసీ హరికృష్ణ, వాటర్‌వర్క్స్ జీఎం సుబ్బారావు, డీజీఎం చంద్రశేకర్, మేనేజర్ వేణుగోపాల్ నాయుడు, ఏఎంఓహెచ్ మైత్రేయి, డీఈ సన్నీ, ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, ముఠా నరేశ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాఖేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, ముఠా శివసింహ, ఎస్టీ ప్రేమ, తుడుం రాజేందర్, పద్మ, తుడుం లక్ష్మి, జహంగీర్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.