మియాపూర్, జూన్ 5 : నివాస ఆవాసాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకర పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటామో బయట కూడా అదే శుభ్రతను పాటించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో జడ్సీ మమత, కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, హైదర్‌నగర్ డివిజన్లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్లతో కలిసి విప్ గాంధీ ఆదివారం శ్రమదానం, అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధులు కాలనీలలో పేరుకుపోయిన చెత్త ఇతర వ్యర్థాలను తొలగించాలని అన్నారు. మురుగు నీరు సాఫీగా పారేలా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరుచుకోవాలని, వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా నీటి నిల్వలను తొలగించాలని, గుంతలను పూడ్చేసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఈఈ గోవర్థన్, ఏఈలు స్వప్న, రాజీవ్, సుభాష్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది, పాల్గొన్నారు.
ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
శేరిలింగంపల్లి, జూన్ 5 : మనిషి ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన డోయన్స్ కాలనీలో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్ వాటర్ హార్వెస్ట్ ప్రాజెక్ట్ సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ కల్పన, నాయకులు శ్రీకళ, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ తెలంగాణ సాధనకే పట్టణ ప్రగతి
కొండాపూర్, జూన్ 5 : స్వచ్ఛ నగరం, స్వచ్ఛ తెలంగాణ సాధన దిశగా పట్టణ ప్రగతి కొనసాగుతుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి 4వ విడత 3వ రోజున ఆయన కొండాపూర్‌లోని అంయజ్యనగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రూపారెడ్డి, రవిశంకర్ నాయక్, ఎండీ అమీనుద్దీన్, రామకృష్ణ, సంతోష్, శ్రీనివాస్, ఎస్ఆర్పీ రాజయ్య, ఎస్ఎఫ్ఏ రమేశ్, సుదీశ్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.